Sunday, April 13, 2025

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి : కేంద్ర మంత్రి జితేంద్రసింగ్

- Advertisement -
- Advertisement -

2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలు మోపుతాడని, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఓ ఆంగ్లఛానల్ ఏర్పాటు చేసిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్ 2025’ లో ఆయన భారత అంతరిక్ష భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు. 2035 నాటికి భారత్ స్వంతంగా అంతరిక్ష కేంద్రాన్ని సమకూర్చుకుంటుందని వెల్లడించారు. చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.

చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమి పైకి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనున్నది. చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేంతవరకు చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే వెల్లడించింది. ఇక భారత తొలి మానవసహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News