Tuesday, April 29, 2025

పాకిస్థాన్‌కు మరో షాక్ ఇవ్వనున్న భారత్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పహల్‌గామ్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. దీనిపై పాకిస్థాన్‌ అక్కసుతో కొన్ని చర్యలకు పాల్పడింది. అందులో ఒకటి భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేయడం. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌కు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలం మూసి వేయాలని భారత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ‘‘ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. ’’ కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పినట్లు పలు ఆంగ్ల మీడియా కథాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే.. పాకిస్థాన్ భారీ నష్టాన్ని ఎదురుకోవాల్సి ఉంటుంది.

భారత గగనతలం మూసివేస్తే.. దక్షిణాసియా దేశాలకు వెళ్లే విమానాలను పాకిస్థాన్ దారి మళ్లించాల్సి ఉంటుంది. శ్రీలంక లేదా చైనా మీదుగా ఈ విమానాలు ప్రయాణించాలి. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు.. నిర్వహణలో కూడా అదనపు భారం పడుతోంది. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ మరింత నష్టాల్లోకి కూరుకుపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News