Monday, December 23, 2024

చమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్లు తగ్గితేనే భారత్ ‘విండ్‌ఫాల్ ట్యాక్స్‌’ను తగ్గించనుంది !

- Advertisement -
- Advertisement -

 

Crude Oil Barrel

లండన్: అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్‌కు 40 డాలర్లు తగ్గితేనే చమురు ఉత్పత్తిదారులు , రిఫైనర్‌ల కోసం గత వారం ప్రవేశపెట్టిన ‘విండ్‌ఫాల్ పన్ను’ను మాత్రమే భారత్ ఉపసంహరించుకుంటుంది అని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ సోమవారం ‘రాయిటర్స్‌’  వార్తా సంస్థకు తెలిపారు. దేశీయ సరఫరా, ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున, అధిక విదేశీ మార్జిన్ల నుండి లాభం పొందడానికి ఉత్పత్తి ఎగుమతులను పెంచిన సంస్థలపై ‘విండ్ ఫాల్ పన్ను’ జూలై 1 నుండి అమలులోకి తెచ్చింది.

‘‘ప్రతి 15 రోజులకు ఒకసారి పన్నులు సమీక్షించబడతాయి,” అని బజాజ్ చెప్పారు. ఇది అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ఆధారపడి ఉంటుంది. “ముడి ధరలు తగ్గితే, విండ్‌ఫాల్ లాభాలు నిలిచిపోతాయి , విండ్‌ఫాల్ పన్నులు కూడా తీసేస్తారు” అని ఆయన తెలిపారు. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర $108.09 వద్ద ఉంది. కాగా  ‘విండ్‌ఫాల్ టాక్స్’ ద్వారా ప్రభుత్వ రాబడి పెరుగుదల ఎంతుంటుందన్న అంచనాను బజాజ్ అందించలేదు.

ఒపెక్ దేశాల ఉత్పత్తి తక్కువగా ఉండటం, లిబియాలో అశాంతి, రష్యాపై ఆంక్షల మధ్య సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ మాంద్యం యొక్క భయాలు,  మార్కెట్‌పై ఒత్తిడి పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్లు సోమవారం బ్యారెల్‌కు 111.27 డాలర్ల మేరకు తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News