Saturday, November 23, 2024

2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం

- Advertisement -
- Advertisement -

India to host 2031 ODI World Cup

ఐసిసి టోర్నీల షెడ్యూల్ ఖరారు

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నమెంట్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. 2031 వరకు జరిగే ఐసిసి టోర్నమెంట్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం వెల్లడించింది. ఈ క్రమంలో భారత్ వేదికగా మూడు ఐసిసి టోర్నమెంట్‌లు జరుగనున్నాయి. 2026లో జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌కు శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతేగాక 2029 చాంపియన్స్ ట్రోఫీకి కూడా భారత్ వేదికగా నిలువనుంది. దీంతో పాటు 2031లో జరిగే పురుషుల వన్డే ప్రపంచకప్ కూడా భారత్‌లోనే జరుగనుంది. ఈ వరల్డ్‌కప్‌ను బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్ కూడా భారత్‌లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, 2024 నుంచి 2031 వరకు ఐసిసి ఆధ్వర్యంలో జరిగే మెగా టోర్నమెంట్ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. మరోవైపు 2024 టి20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించనుంది.

క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2025 చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసిసి మెగా టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. ఇక 2026 టి20 ప్రపంచకప్‌కు భారత్‌శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరోవైపు 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2028 టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాన్యూజిలాండ్ వేదికగా జరుగనుంది. ఇక 2029 చాంపియన్స్ ట్రోఫీ భారత్‌లో జరుగనుంది. 2030 టి20 వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ఐసిసి టోర్నమెంట్‌ల నిర్వహణలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు సముచిత స్థానం దక్కింది. కరీబియన్ క్రికెట్ బోర్డు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో ఆ దేశానికి ఒక టోర్నమెంట్‌ను మాత్రమే ఖరారు చేశారు. భారత్ మాత్రం మూడు మెగా టోర్నమెంట్‌లకు ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఐసిసి టోర్నీల్లో భారత్ పైచేయి మరోసారి స్పష్టమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News