Saturday, December 21, 2024

11 నుంచి పౌరవిమానయానంపై రెండో ఆసియా పసిఫిక్ సదస్సు

- Advertisement -
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 11,12 తేదీల్లో పౌరవిమాన యానంపై రెండో ఆసియా పసిఫిక్ మంత్రిత్వ సదస్సు జరుగుతుంది. 41 దేశాల నుంచి దాదాపు 250 మంది ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. 12 వ తేదీన ముగింపు సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతారు. ప్రపంచ ఎయిర్ ట్రాఫిక్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి చెప్పుకోదగిన ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో ఏవియేషన్ మార్కెట్‌లో భారత్ వేగంగా పురోగమిస్తోంది. రీజియన్‌లో పౌరవిమానయాన రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఈ సదస్సులో రోడ్‌మ్యాప్ కోసం చర్చించడమవుతుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు విలేఖరులకు వెల్లడించారు.

41 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నామని , అయితే పాకిస్థాన్ నుంచి ఎవరూ హాజరు కారని, చైనా విషయం పరిశీలనలో ఉందని పౌర విమానయాన విభాగం సెక్రటరీ వుమ్లున్‌మాంగ్ వుయాల్‌నామ్ వెల్లడించారు. వియత్నాం, మాల్దీవులు, జపాన్, సింగపూర్ దేశాలతో సహా వివిధ దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. భారత ప్రభుత్వం, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ ఆసియా పసిఫిక్ పౌరవిమానయాన మొదటి సదస్సు 2018లో బీజింగ్‌లో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News