Friday, December 27, 2024

మన ఆతిథ్యంలో జి 20 స్పీకర్ల భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం జి 20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది. అక్టోబర్ 12 నుంచి 14 వరకూ పార్లమెంట్ కొత్త భవనంలో స్పీకర్ల సదస్సు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. జి 20 సారథ్య బాధ్యతలలో ఇండియా ఇప్పుడు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ లక్షాల సాధనలో మరింతగా ఇతర దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు , రాజకీయంగా పలు విషయాలలో ఏకాభిప్రాయ సాధనకు స్పీకర్ల సదస్సుకు సంకల్పించారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ సమావేశం జరగడం ప్రధానమైన విషయం అని జి20 ఇండియా ప్రత్యేక కార్యదర్శి ముక్తేష్ పరదేశి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News