న్యూఢిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతదేశం మిస్ వరల్డ్(ప్రపంచ సుండరి) 2023 పోటీలకు వేదిక కానున్నది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. భారతదేశం చివరిసారి 1996లో అ అతర్జాతీయ అందాల పోటీలు మిస్ వరల్డ్‌కు ఆతిథ్యమిచ్చింది.
భారతదేశ భిన్న సంస్కృతికి, విశిష్ట సంప్రదాయాలకు 71వ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు వేదిక కానున్నట్లు మిస్ వరల్డ్ సంస్థ సిఇఓ, చైర్‌పర్సణ జూలియా మోర్లీ గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 130 దేశాలకు చెందిన అందాల సుందరీమణులు ఈ పోటీలో పాల్గొటారని ఆమె తెలిపారు.
నెలరోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పోటీలో పాల్గొనే అందాల భామలు తెలివితేటలను, క్రీడా సవాళ్లను, దాతృత్వ కార్యకలాపాలను ప్రదర్శిస్తారు. గత ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న పోలాండ్‌కు చెందిన కరోలినా బైలావ్‌స్కా ఈ ఏడాది మిస్ వరల్డ్ విజేతకు తన కిరీటాన్ని అప్పగించనున్నారు. ఆమె కూడా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు.