Monday, December 23, 2024

2028 నాటికి చంద్రయాన్ 4 ప్రయోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చంద్రయాన్3 మిషన్ చారిత్రక విజయం తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) తరువాత చంద్రయాత్ర (చంద్రయాన్ 4)కు సిద్ధమౌతోంది. 2028 నాటికి ఈ ప్రయోగం జరగవచ్చు. ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్‌ఎసి)కి చెందిన డాక్టర్ నీలేష్ దేశాయ్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తదుపరి చంద్రయాన్ 4 ప్రయోగం 2028లో జరుగుతుందని వెల్లడించారు. ఈ మిషన్ లూపెక్స్ మిషన్‌గా ఆయన పేర్కొన్నారు.

ఇటీవలనే ముగిసిన చంద్రయాన్ 3 మిషన్ లక్షాలను చంద్రయాన్ 4 నెరవేరుస్తుందని చెప్పారు. చంద్రుని ఉపరితలం పై ఉన్న శిలల నమూనాలను తిరిగి భూమికి తీసుకురావడంలో చాలా సంక్లిష్టమైన లక్షాలను నెరవేరుస్తుందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుని ఉపరితలం నుంచి శిలల నమూనాలను తీసుకువచ్చే నాలుగోదేశం భారత్ అవుతుందని ఆయన అభిలషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News