Sunday, January 19, 2025

హైదరాబాద్ స్టార్టప్ రాకెట్ నింగికి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : భారతదేశానికి చెందిన తొలి ప్రైవేటు రంగ నిర్మిత అంతరిక్ష వాహక నౌక విక్రమ్ ఎస్ ప్రయోగం ఈ నెల 15న జరుగుతుంది. దేశంలో తొలిసారిగా ఈ రాకెట్‌ను హైదరాబాద్‌లోని స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఎరోస్పేస్ రూపొందించింది. ఈ కంపెనీ రాకెట్ తొట్టతొలి ప్రయాగాన్ని ఆరంభ్ పేరిట తక్కువ స్థాయి కక్షలోకి ఇస్రోకు చెందిన శ్రీహరికోట ప్రయోగకేంద్రం నుంచి పరీక్షిస్తారు. రెండు పేలోడ్స్‌తో ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. అంతరిక్షంలోకి రెండు భారతీయ, ఓ విదేశీ పేలోడ్స్‌ను తీసుకువెళ్లుతారని స్కైరూట్ ఎరోస్పేస్ సిఇఒ, సహవ్యవస్థాపకులు అయిన పవన్‌కుమార్ చందన తెలిపారు.

ఇప్పుడు మా గుండె నాడి వేగం పెరిగింది. అన్ని కళ్లూ ఆకాశం వైపే చూస్తాయని వ్యాఖ్యానించారు. తాము ఈ వాహకనౌకలకు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు విక్రమ్ సారాభాయ్ సంస్మరణలో విక్రమ్ పేరు పెట్టామని తెలిపారు. తాము రూపొందించే రాకెట్‌లను ఇస్రో ప్రయోగకేంద్రం నుంచి కక్షల్లోకి పంపించేందుకు ఈ సంస్థ ఇస్రోతో వాణిజ్యపరమైన ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఎయిరోస్పేస్ స్టార్టప్ రూపొందించిన ఫన్ శాట్, అమెరికా, సింగపూర్‌లకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను విక్రమ్ ద్వారా కక్షల్లోకి పంపిస్తారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న స్కైరూట్ ఎరోస్పేస్ సంస్థను ఇస్రోలో ఇంతకు ముందు పనిచేసిన ఇంజనీర్లు, సైంటిస్టులు కలిసి 2018లో ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News