Tuesday, March 25, 2025

స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్ టెస్ట్ సిరీస్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: టీం ఇండియా తన సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. స్వదేశంలో దాదాపు పుష్కరకాలం తర్వాత ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగనుంది. 2013-14లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి ఇదే చివరి టెస్ట్ సిరీస్. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2న మొహాలీలో తొలి టెస్టు, 10న కోల్‌కతాలో రెండో టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ సిరీస్ తర్వాత స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ-20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌ గువాహటి వేదికగా జరుగనుంది. టెస్ట్ మ్యాచ్‌కి గువాహటి వేదిక కావడం ఇదే తొలిసారి. అంతేకాక.. వన్డే సిరీస్‌లో మూడో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డిసెంబర్ 6న జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News