Wednesday, January 22, 2025

వ్యవసాయం కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల అమెరికన్ డాలర్ల రుణాన్ని అందచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. భారత్‌ను సందర్శించిన కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటోతో చర్చల సందర్భంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉభయ దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకునే లక్షంతో కెన్యా అధ్యక్షుడు రూటో సోమవారం మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు.

రూటోతో చర్చల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ తన విదేశీ విధానంలో ఆఫ్రికాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గత దశాబ్ద కాలంగా ఆఫ్రికాతో సంబంధాలను మరింత పటిష్టం చెందాయని తెలిపారు. కెన్యా అధ్యక్షుడి భారత పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడమే కాక ఆఫ్రికాతో భారత్ సంబంధాలలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని మోడీ అన్నారు.

వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణాన్ని భారత ప్రభుత్వం అందచేస్తుందని ఆయన తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న పెను సవాలు తీవ్రవాదమని తమ రెండు దేశాలు భావిస్తున్నాయని, తీవ్రవాదాన్ని నిరోధించడంలో పరస్పర సహకారానికి రెండు దేశాలు అంగీకరించాయని ప్రధాని మోడీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News