- Advertisement -
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఘోర పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి బుమ్రాకు టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భావిస్తున్నట్టు తెలిసింది. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి.
- Advertisement -