Thursday, January 30, 2025

అమెరికా వస్తువులపై సుంకం తగ్గించే యోచనలో భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమెరికా కొ త్త అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ఇస్తున్న ఝలక్ ల నేపథ్యంలో భారత ప్రభుత్వం కాస్త ఆచీ తూచీ వ్యవహరించాలని భావిస్తున్నట్లు కన్పిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై ఉన్న సుంకాన్ని కాస్త తగ్గించే యోచన చేస్తోంది. ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, ఖరీదైన మోటర్ సైకిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల పై నిధించే దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి నిర్ణయం వల్ల దేశంలోని పరిశ్రమలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు ఈ విషయంలో ఓ స్పష్టతవస్తుందని భావిస్తున్నారు. నిజానికి భారతదేశం అమెకితా నుండి 20 వస్తువులను దిగుమతి చేసుకుంటుంది, వాటిపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలు ఉన్నాయి.
బ్రిక్ దేశాలు అం ట్రంప్ మొదటి నుంచీ గుర్రుగానే ఉన్నాడు. అందుకే ప్రెసిడెంట్ పదవి చేపట్టిన వెంటనే ఈ దేశాలను టార్గెట్ చేస్తూ ఇండియా తోపాటు, చైనా, బ్రెజిల్ పై భారీగా సుంకాల వడ్డింపు తప్పదని హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది. ఈ దేశాలను విపరీతంగా టారిఫ్ లు విధించే దేశాలుగా ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. అమెరికాను నెంబర్ 1 చేసేందుకు అమెరికాకు నష్టం చేసే దేశాలపైనా, వ్యక్తులపైన భారీగా సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు రిపబ్లికన్ ల సమావేశంలో సోమవారం ట్రంప్ చేప్పారు. ప్రధానంగా చైనా టారిఫ్ రూపంలో పెద్దఎత్తున డబ్బు దండుకుంటోందని పేర్కొంటూనే, ఇండియా, బ్రెజిల్ , ఇతర దేశాలను ప్రస్తావించారు. దీనిని ఇక ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించాడు కూడా. నవంబర్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ లో జరిపిన ప్రచారంలోనే ఈ హెచ్చరికలు ధ్వనింపజేశారు.

భారత్, చైనా, బ్రెజిల్ అమెరికా ఉత్పత్తులపై ఎంత టారిఫ్ విధిస్తాయో.. అదే స్థాయిలో ఆయా దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని అప్పట్లోనే ట్రంప్ అన్నాడు. నిరుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది గా ముందే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అతి త్వరలోనే మోదీ మళ్లీ అమెరికాలో పర్యటించనున్నారు. టారీఫ్ ల విషయంలో ట్రంప్ ప్రకటనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ట్రంప్ ఎజెండా స్పష్టమైంది. దీనివల్ల అమెరికాలో ఉత్పత్తుల తయారి ఊపు అందుకేవచ్చు. అలాగే ఉక్కు, సెమీ కండక్టర్లు, ఫార్మస్యూటికల్స్ వంటి కీలక వస్తువుల ధరలు ప్రస్తావించడం ద్వారా వాటిని దిగుమతి చేసుకునే దేశాలు సుంకాలను కూడా తగ్గించాలని ట్రెప్ కోరుతున్నట్లు తేటతెల్లం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News