Monday, December 23, 2024

నేడు అగ్ని-v క్షిపణిని పరీక్షించబోతున్న భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చాలా కాలంగా అనుకుంటున్న అగ్ని-v క్షిపణిని నేడు భారత పరీక్షించబోతున్నది. ఇది చైనాకు ఆందోళన కలిగిస్తోంది. అగ్ని-v క్షిపణిని పరీక్షించబోతున్న నేపథ్యంలో భారత అధికారులు బంగాళాఖాతంలో ‘నో ఫ్లయ్ జోన్’ నోటీస్‌ను జారీచేశారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో డిసెంబర్ 15-16 తేదీల్లో అగ్ని-v బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించబోతున్నారు. భారత క్షిపణి పరీక్షకు ముందే డిసెంబర్ 6న చైనా తన గూఢచార నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిందన్నది ఇక్కడ గమనార్హం. పరీక్షించబోతున్న అగ్ని-v క్షిపణి 5400 కిలోమీటర్ల వరకు నింగిలోకి దూసుకెళుతుందని ఆ ప్రకటన పేర్కొంది.
అగ్ని-v భారత్ రూపొందించిన దీర్ఘ శ్రేణి అణు సామర్థం గల ఖండాతర క్షిపణుల సీరీస్‌లో ఐదవది. ఇదివరలో ఇలాంటి క్షిపణుల పరీక్షలను 2012,2013,2016,2018 సంవత్సరాల్లో చేపట్టారు. ఇప్పుడు 2021లో చేపట్టేది ఐదవది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) 2008 నుంచే అగ్ని-vను అభివృద్ధి చేస్తోంది. అగ్ని-vను జలాంతర్గామి నుంచి కూడా ప్రయోగించొచ్చు. ఈ క్షిపణి ప్రయోగం చైనాను కలవరపరుస్తోంది. చైనా ప్రభుత్వ మీడియా అయితే ఈ క్షిపణి 8000 కిమీ. వరకు పోగలదని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News