Sunday, December 22, 2024

ఆదుకున్న గిల్, పంత్

- Advertisement -
- Advertisement -

ఓవర్‌నైట్ 86/4 స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాను శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌లు ఆదుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటూ ఇన్నింగ్స్ పటిష్టపరిచేందుకు ప్రయత్నించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. పంత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరోవైపు గిల్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో రిషబ్ పంత్ వెనుదిరిగాడు. 59 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేసిన రిషబ్‌ను ఐష్ సోధి వెనక్కి పంపాడు.

ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 146 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 90 పరుగులు చేసి ఎజాజ్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన వాషింగ్టన్ సుందర్ 36 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి నిరాశ పరిచాడు. సర్ఫరాజ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. జడేజా (16) పరుగులు చేశాడు. అశ్విన్ (6), ఆకాశ్‌దీప్ (0)లు కూడా విఫలమయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ముగిసింది. భారత్‌కు 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News