- Advertisement -
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాద మృతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. జెనీవా లోని అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉన్నట్టు రాజ్యసభలో తెలిపారు. 2020 లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే 70 శాతం ఉన్నట్టు గడ్కరీ చెప్పారు. ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు సహా 22 గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్టు ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్, ఛాసిస్ నెంబర్ ఆధారంగా వాహనాలకు ఫాస్టాగ్ జారీ చేసినట్టు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకులు 4.95 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాయని తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ల ప్రవేశం 96.5 శాతానికి చేరినట్టు వివరించారు.
- Advertisement -