Wednesday, January 22, 2025

మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలి: కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్ లో ఇండియా కూటమి పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఇండియా కూటమి కలిసింది. ఇంఫాల్ రాజ్‌భవన్‌లో గవర్నర్ అనుసూయ ఉకేతో భేటీ అయ్యారు. మణిపూర్ గవర్నర్‌కు 21 మంది ఎంపిలు మెమోరాండం ఇచ్చారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని విపక్ష నేతలు కోరారు. మణిపూర్‌లో పరిస్థితులు దిగజారిపోయాయని కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ పేర్కొన్నారు. మణిపూర్‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మణిపూర్‌లో ప్రభుత్వ వైఫల్యం వల్లే సమస్య తలెత్తిందని, వీలైనంత తొందరగా శాంతి నెలకొల్పాలని అధిర్ రంజన్ సూచించారు.

Also Read: వరదలతో నష్టం…. తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర అధికారుల బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News