ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్ కేసులు తీవ్రరూపం దాల్చుతుండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. పరిస్థితులను గమనిస్తే సిరీస్ జరిగే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. రానున్న ట్వంటీ20 ప్రప ంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్‌శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు మరో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డు లు నిర్ణయించాయి. భారత్‌తో పోల్చితే లంకలో కరోనా తీవ్రత ఏమాత్రం లేదు. అయితే గురువా రం ఒక్కరోజే శ్రీలంకలో కొత్తగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
అంతేగాక 24 మరణాలు కూడా సంభవించాయి. వా రం రోజుల్లో లంకలో ఏకంగా 16,349 కేసులు బయటపడ్డాయి. ఇలాంటి స్థితిలో శ్రీలంకలో కఠి న ఆంక్షలు అమలు చేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే టీమిండియా అక్కడ పర్యటించడం కష్టమేనని చెప్పాలి. ఇప్పటికే కిందటి ఏడాది ఇరు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ కూడా కరోనా వల్ల వాయిదా పడిన విష యం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది జరిగే సిరీస్‌పై కూడా కారు మబ్బులు కమ్ముకుంటున్నా యి. అయితే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్టుగానీ, వాయిదా వేస్తున్నట్టు గానీ ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. కొన్ని రోజుల పాటు వేచి చూసే ధోరణితో ఇరు జట్ల బోర్డులు ఉన్నాయి.
మరోవైపు సిరీస్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని లంక క్రికెట్ బోర్డుకు చెందిన ఒక అధికారి తెలిపారు. ఇక భారత్ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న రాజధాని కొలంబోలు కరోనా తీవ్రత అధికింగా ఉండడం ఇరు దేశాల క్రికెట్ బోర్డులను కలవరానికి గురిచేస్తోంది. కాగా, ఈ సిరీస్ ద్వారా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ల సామర్థాన్ని పరీక్షించాలని భావించిన బిసిసిఐకి కూడా పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ టూర్ సమయంలోనే లంకకు మరో టీమ్‌ను పంపించాలని భార త క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికకానీ క్రికెటర్లతో లంకకు మరో జట్టును పంపించేందుకు బిసిసిఐ ప్రణాళిక రచించింది. శిఖర్ ధావన్, భువనేశ్వర్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా, ఇషాన్ కిషన్, శాంసన్, తెవాటియా, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి, పడిక్కల్ తదితరులతో లంక టూర్‌కు జట్టును ఎంపిక చేయాలని బిసిసిఐ భావిస్తోంది. కానీ శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.