Thursday, April 3, 2025

విండీస్ సిరీస్… షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ముంబై : వెస్టిండీస్‌తో జరిగే టీమిండియా సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది జులైఆగస్టు నెలల్లో విండీస్ గడ్డపై భారత్ సిరీస్ ఆడనుంది. సిరీస్‌లో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మరో ఐదు టి20 లను భారత్ ఆడుతుంది. ఇక సిరీస్‌కు సంబ ంధించిన షెడ్యూల్‌ను సోమవారం బిసిసిఐ వెల్లడించింది. జులై 12 నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు, జులై 20 నుంచి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు జరుగుతుంది. జులై 27 నుంచి ఆగస్టు ఒకటి వరకు వన్డే సిరీస్ జరుగనుంది. ఇక ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.

Also Read: మరో ఐదేళ్లు కష్టపడితే అన్నింటా మనమే టాప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News