కానీ భారత్ ప్రథమం ఎల్లప్పుడూ
యుఎస్‌తో బిటిఎపై విదేశాంగ మంత్రి జైశంకర్
ముంబయి : వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రస్తుతం మూడు ప్రధాన సంప్రదింపుల్లో పాల్గొంటున్నదని, వాటిలో ఒకటి యునైటెడ్ స్టేట్స్‌తో అని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ముంబయిలో ‘బిజినెస్ టుడే మైండ్ష్ 2025’ సదస్సులో చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవహారాల సంప్రదింపుల సంగతికి వచ్చినప్పుడు వాణిజ్య ఒప్పందాలు ఎల్లప్పుడూ ప్రధాన స్థానం ఆక్రమిస్తుంటాయి. ఇది ఇప్పుడు మరింతగా ఉన్నది. ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించి తీరాలి. ప్రస్తుతం మేము ముఖ్యంగా మూడు ప్రధాన సంప్రంపుల్లో ఉన్నాం యూరోపియన్ యూనియన్ (ఇయు), యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎలు), యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ)పై చర్చలు సాగుతున్నాయి. ఈ వారమే మేము న్యూజిలాండ్‌తో కూడా సంప్రదింపులు ప్రారంభించాం.
మరి కొన్ని కూడా జరగబోతున్నాయి’ అని మంత్రి తెలియజేశారు. ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదరించిన తరువాత భారత్ ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. సునిశిత టెక్నాలజీలను భారత్ పొందే విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని జైశంకర్ చెప్పారు. ‘భారత్ ప్రథమం’ విధానాన్ని తాము అనుసరిస్తామని జైశంకర్ మరొకసారి చెప్పారు. ‘వికసిత్ భారత్ లక్షంగా ఈ విషయంలో భారత్ ప్రథమం దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ సంబంధాల్లో ఇప్పటి వరకు అందుకోని సామర్థాలను సాధించే అవకాశం గురించి కూడా ఆలోచనలు ఉంటాయి.
ఇంతకు ముందు మా ఎఫ్‌టిఎలలో చాలా వరకు ఆసియా ఆర్థిక వ్యవస్థలతో ఉన్నాయి. వాటిలో అనేకం పోటీ లక్షణంతో ఉన్నాయి. గల్ఫ్, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలతో సంప్రదింపుల ద్వారా సమతూకం సాధించడం ఆర్థికంగా లాయకీ కావడమే కాకుండా వ్యూహాత్మకం కూదా’ అని మంత్రి వివరించారు. పరస్పవర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందానికి వచ్చేందుకు ‘వివిధ స్థాయిల్లో’ యుఎస్ ప్రభుత్వంతో భారత్‌తో సంప్రదింపులు సాగిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌జైశ్వాల్ శుక్రవారం తెలియజేశారు.