Sunday, December 22, 2024

త్వరలో అమెరికాలో భారత్ యుపిఐ సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థ దేశం దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ తర్వాత అమెరికాలో కూడా త్వరలో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం యుపిఐ చెల్లింపును ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ఈ విషయంలో రియల్ టైమ్ చెల్లింపుల కోసం అమెరికన్ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.

త్వరలో అమెరికాలో యుపిఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎన్‌పిసిఐ రెండు దేశాల మధ్య రియల్ టైమ్ చెల్లింపులపై చర్చిస్తోంది. పెడ్‌నౌ, యుపిఐని లింక్ చేయడానికి ఎన్‌పిసిఐ యుఎస్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భారతదేశం, మారిషస్ మధ్య రూపే క్రెడిట్ కార్డ్, యుపిఐ కనెక్టివిటీని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News