Friday, December 20, 2024

భారత్‌కు 31 అమెరికా ఎంక్యూ 9 బి డ్రోన్లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్త కీలక పరిణామాల నడుమ భారతదేశానికి 31 సాయుధ సంపత్తి డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. వీటి విలువ దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ డ్రోన్ల ఒప్పంద ప్రతిపాదన అత్యంత కీలకం, పరిణామాత్మకం అని అమెరికా తెలిపింది. భారతదేశానికి 31 అత్యంత అధునాతన ఎంక్యూ 9 బి సాయుధ డ్రోన్లను సమకూర్చే ఒప్పందానికి అమెరికా రక్షణ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. భారతదేశ సముద్ర తీర ప్రాంత భద్రతకు ఇటువంటి డ్రోన్ల అవసరం అత్యవసరం. భారత దేశ సముద్ర తీర ప్రాంతాలలో మానవరహిత పర్యవేక్షణ, అవిచ్ఛిన్నకర తనిఖీలకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయుక్తం అవుతాయి. సముద్ర మార్గంలో భారత్ పట్ల ఎటువంటి కవ్వింపు చర్యలను అయినా సకాలంలో పసికట్టేందుకు తద్వారా సరైన విధంగా వీటిని తిప్పికొట్టేందుకు ఈ డ్రోన్లతో మార్గం ఏర్పడుతుంది. భద్రతా రంగంలో భారతదేశంతో తమ భాగస్వామ్యం అత్యంత గణనీయం

, కీలకం అని , పలు ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి భారతదేశంతో తాము మరింత సన్నిహితంగా వ్యవహరిస్తామని ఇప్పటి డీల్ ప్రతిపాదన నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ రోజువారి మీడియా భేటీ దశలో రిపోర్టర్లకు తెలిపారు. ఈ డ్రోన్ల సరఫరా నిర్ణయం ఈ దిశలో ఓ తొలి దశ. దీనిని ముందుగా చట్టసభలకు తెలియచేయడం జరిగింది. అయితే ఎప్పటికీ ఈ డ్రోన్లు భారతదేశానికి అందుతాయి? సంబంధిత కాల సూచీ విషయాలన్ని కూడా వచ్చే కొద్ది నెలల్లో భారత ప్రభుత్వంతో సంప్రదింపుల క్రమంలో ఖరారు అవుతాయని వివరించారు. ఇరుగుపొరుగు, ప్రత్యేకించి సముద్ర జలాల మార్గాలలో తలెత్తుతున్న పలు సవాళ్లను భారతదేశం మరింత పటిష్ట రీతిలో ఎదుర్కొనేందుకు ఇటువంటి డ్రోన్లను సంతరించుకోవడం కీలకం అవుతుంది. ప్రతిపాదిత డీల్ పరిధిలో అమెరికా నుంచి భారతదేశానికి 31 హేల్ యుఎవి డ్రోన్లు అందుతాయి. అత్యంత ఎతైన ప్రాంతాలలో దుర్బర పరిస్థితులను కూడా తట్టుకుని ఈ డ్రోన్లు మానవరహితంగా గస్తీ తిరుగుతాయి.

నిఘా సంబంధిత నిర్థిష్ట సమాచారం రక్షణ శాఖకు లేదా ఇంటలిజెన్స్ వర్గాలకు అందేందుకు వీలేర్పడుతుంది. ఈ 31 డ్రోన్లలలో 15 సముద్ర రక్షక డ్రోన్లు ఉంటాయి. కాగా భారతీయ పదాతిదళ సైన్యం, భారతీయ వైమానిక దళం ఎనిమిది చొప్పున భూ ఉపరితల కేంద్రీకృత స్కై గార్డియన్ డ్రోన్లు పొందుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News