Friday, January 10, 2025

భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం మలేషియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ 50 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండు విజయాలు, ఒక డ్రాతో మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు పదేపదే దాడులు నిర్వహిస్తూ గోల్ కోసం ప్రయత్నించింది.

చివరికి 15వ నిమిషంలో భారత్ ప్రయత్నం ఫలించింది. సెల్వం కార్తీ అద్భుత ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు 10 ఆధిక్యాన్ని సాధించి పెట్టాడు. ఆ తర్వాత కూడా భారత్ దూకుడుగా ఆడినా మరో గోల్ మాత్రం నమోదు చేయలేక పోయింది. కానీ ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు అసాధారణ ఆటతో చెలరేగి పోయారు. వరుస గోల్స్‌తో మలేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, జగ్‌రాజ్ సింగ్‌లు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో సఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో 50 తేడాతో జయకేతనం ఎగుర వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News