Monday, December 23, 2024

రష్యాకు తొలిసారి వ్యతిరేకంగా ఓటేసిన భారత్

- Advertisement -
- Advertisement -

UNSC
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా నిలిచింది. చైనా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై దాడిచేశాక అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిందన్నది తెలిసిన విషయమే. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని భారత్ ఎన్నడూ విమర్శించలేదు. రష్యా, ఉక్రెయిన్ దౌత్య చర్చలకు రావాలని భారత్ ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది. భారత్ ప్రస్తుతం యుఎన్‌ఎస్‌సిలో అశాశ్వత(నాన్‌పర్మనెంట్) సభ్యత్వ దేశంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News