Wednesday, September 18, 2024

అర్జెంటీనాతో భారత్ మ్యాచ్ డ్రా

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో భాగంగా అర్జెంటీనాతో సోమవారం జరిగిన హాకీ మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు డ్రాగా ముగించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను భారత్ 11తో డ్రా చేసింది. ఇటు భారత్, అటు అర్జెంటీనా అసాధారణ ఆటతో అలరించాయి. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ స్కోరు కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే చాలా సేపటి వరకు గోల్ మాత్రం లభించలేదు. తొలి క్వార్టర్‌లో భారత్ కాస్త పైచేయి సాధించింది. అయినా గోల్ సాధించడంలో విఫలమైంది. కాగా, ఆట 22వ నిమిషంలో అర్జెంటీనా గోల్ సాధించింది. లూకాస్ మార్టినెజ్ అద్భుత గోల్‌ను నమోదు చేశాడు. దీంతో అర్జెంటీనా 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ దశలో భారత్ కూడా ఎటాకింగ్ మార్గాన్ని ఎంచుకుంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేసింది. అయినా పటిష్టమైన డిఫెన్స్‌తో భారత దాడులను అర్జెంటీనా సమర్థంగా తిప్పికొట్టింది. ద్వితీయార్ధంలో కూడా పోరు ఉత్కంఠభరితంగానే కొనసాగింది. స్కోరును సమం చేసేందుకు భారత్ తీవ్రంగా శ్రమించింది. కానీ, చాలా సేపటి వరకు భారత్‌కు గోల్ లభించలేదు. అయితే మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా భారత్ అద్భుత గోల్‌తో స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్ 58వ నిమిషంలో ఈ కీలక గోల్ సాధించాడు. దీంతో మ్యాచ్ 11తో డ్రాగా ముగిసింది. పూల్‌బిలో భాగంగా ఇంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 32 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News