Wednesday, January 22, 2025

భారత్ భారీ విక్టరీ

- Advertisement -
- Advertisement -

ఇండోర్: రెండో వన్డేలో భారత్ భారీ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు శతకాల మోత మూగించారు. శుభ్‌మన్‌గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదంతొక్కగా వీరికి తోడు చివర్లో సూర్యా కుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్, కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్ధ శతకంలో చెలరేగండం పాటు బౌలింగ్ దళం సయితం రాణించడంతో రెండో వన్డేల్లో టీమిండియా 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సరీస్‌ను సొంతం చేసుకుంది భారత్. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6×4, 4×6 : 104),

శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11×4, 3×6 : 105) శతకాలతో చెలరేగడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6×4, 6×6: 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3×4, 3×6 : 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష చేధనకు దిగిన ఆసీస్ బ్యాటర్లలో డెవిడ్ వార్నర్(53), సీన్ అబాట్(54) తప్ప మరెవరూ రాణించక పోవడంతో ఆస్ట్రేలియా జట్టు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

అదిలోనే భారత్‌కు షాక్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జోష్ హజెల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) కీపర్ క్యాచ్ ఇచ్చి తక్కువ స్కోరుకు జైట్ కావడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత స్కోర్ బోర్డును చక్కదిద్దారు. తొలుత ఆచితూచి ఆడిన వీరు క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఆసీస్ బౌలర్లను కంగారు పెట్టించారు. దాంతో పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ముందుగా శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అర్ధ శతకం అనంతరం అయ్యర్ ధాటిగా ఆడాడు. 86 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

జోరుమీదున్న అయ్యర్ అబాట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 200 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెఎల్ రాహుల్ రాగా.. శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. అతను కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. అనంతరం రాహుల్ సయితం అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో రాహుల్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి సూర్యాకుమార్ యాదవ్ వచ్చాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్.. సూర్యతో కలిసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ ఔటైనా.. సూర్య తనదైన శైలిలో చెలరగాడు. వరుస సిక్స్‌లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య జట్టుకు 399 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News