Sunday, December 22, 2024

హ్యాట్రిక్‌పై టీమిండియా కన్ను

- Advertisement -
- Advertisement -

పరువు కోసం ఆస్ట్రేలియా, నేడు చివరి వన్డే
రాజ్‌కోట్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా బుధవారం ఆస్టేలియాతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది. అంతేగాక ఆస్ట్రేలియాపై తొలిసారి వైట్‌వాష్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్ కూడా టీమ్‌లో చేరాడు. అయితే హార్దిక్ పాండ్య ఇప్పటి వరకు జట్టుకు అందుబాటులో రాలేదు. అతను చివరి వన్డేలో ఆడుతాడా లేదా అనేది సందేహమే.

మరోవైపు శుభ్‌మన్ గిల్‌కు చివరి వన్డేలో విశ్రాంతి ఇచ్చారు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమి వ్యక్తిగత కారణంతో ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. శార్దూల్ ఠాకూర్ కూడా చివరి వన్డేలో ఆడడం లేదు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం టీమిండియాలో 13 మంది మాత్రమే ఉన్నారు. గిల్ తప్పుకోవడంతో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అతను కాకుంటే రాహుల్ ఓపెనర్‌గా దిగే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా దూకుడు మీద కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రానున్న వరల్డ్‌కప్‌నకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బాగానే ఉన్నా ఆస్ట్రేలియాకు తొలి రెండు వన్డేల్లో నిరాశ తప్పలేదు. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News