Sunday, December 22, 2024

సిరీస్‌పై భారత్ కన్ను..

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: భారత్‌తో శుక్రవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సిద్ధమైంది. గౌహతి వేదికగా జరిగిన మూడో టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అయితే కిందటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. మ్యాక్స్‌వెల్‌తో పాటు స్మిత్, స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ తదితరులు స్వదేశం వెళ్లిపోయారు. వీరి స్థానంలో కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఇలాంటి స్థితిలో భారత్‌ను ఓడించాలంటే ఆస్ట్రేలియా సర్వం ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది.

అయితే ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, అరోన్ హార్ది, మాథ్యూవేడ్, టిమ్ డేవిడ్ తదితరులతో ఆస్ట్రేలియా పటిష్టంగానే ఉంది. హెడ్ ఫామ్‌లో ఉండడం జట్టుకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. షార్ట్, మెక్‌డెర్మెట్, వేడ్, హార్డిలు కూడా ధాటిగా ఆడే వారే. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా టీమిండియా బౌలర్లకు కష్టాలు ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమయం చేయాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. కిందటి టి20లో భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది.

గెలుపే లక్షంగా..
మరోవైపు ఆతిథ్య టీమిండియా కూడా ఈ మ్యాచ్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News