Sunday, December 22, 2024

నేడు బంగ్లాదేశ్‌తో భారత్ పోరు

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన మహిళల ఆసియాకప్ సెమీ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. రాత్రి జరిగే రెండో సెమీస్‌లో ఆతిథ్య శ్రీలంకతో పాకిస్థాన్ పోటీ పడుతుంది. గ్రూప్‌ఎలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్ సెమీస్‌కు దూసుకొచ్చింది. సెమీస్ చేరే క్రమంలో పాకిస్థాన్, యుఎఇ, నేపాల్ జట్లను ఓడించింది. ఇక బంగ్లాదేశ్ మూడింటిలో రెండు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లాదేశ్ థాయిలాండ్, మలేసియా జట్లపై విజయం సాధించింది. ఇక బంగ్లాతో జరిగే సెమీస్ పోరులో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కూడా శుభారంభం అందించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.

ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా మంధాన, షెఫాలీలకు ఉంది. వీరు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం. కొంతకాలంగా మంధాన మూడు ఫార్మాట్‌లలోనూ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగే సెమీ ఫైనల్లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మంధాన విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత మంధానపై నెలకొంది. షెఫాలీ కూడా తన జోరును కొనసాగించక తప్పదు. షెఫాలీ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, సంజన తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా భారత్‌కు మెరుగైన స్కోరు ఖాయమనే చెప్పాలి. బౌలింగ్‌లోనూ భారత్ చాలా బలంగా ఉంది. అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. టీమిండియా సాధించిన హ్యాట్రిక్ విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఇక సెమీస్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News