Thursday, January 23, 2025

 ఇండియా స్కోర్ 210/5 (45 ఓవర్లు)

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ తో జరుగుతున్న అండర్-19 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటింది. 45 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రియాంశు మోలియా 14 పరుగులతోనూ, సచిన్ దాస్ రెండు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.

మొదట బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 పరుగులు, ఉదయ్ సహారన్ 64 పరుగులు చేయడంతో ఇండియా నిలదొక్కుకుంది. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆరవెల్లీ రావు 23 పరుగులు చేసి మరూఫ్ మృదా బంతికి చిక్కి ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మృదా మూడు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News