Sunday, January 26, 2025

నేడు ఇంగ్లండ్‌తో రెండో టి20.. ఫుల్ జోష్ లో భారత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇంగ్లండ్‌తో శనివారం చెన్నై వేదికగా జరుగనున్న రెండో టి20కి టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. కోల్‌కతాలో జరిగిన మొదటి టి20లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. కిందటి పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా రాణించింది. బౌలర్లు అద్భుత ప్రతిభతో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు బంతిని తిప్పేసారు. వీరి బౌలింగ్ ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు ఎదురు నిలువలేక పోయారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అర్ష్‌దీప్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అతను విజృంభిస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టాలు ఖాయం. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు కిందటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు.

ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. రవి బిష్ణోయ్ వికెట్లను సాధించక పోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇక బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ జట్టుకు కీలకంగా మారాడు. తొలి టి20లోఅభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఈసారి కూడా అతని నుంచి జట్టు ఇలాంటి ఇన్నింగ్స్‌నే ఆవిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. కిందటి మ్యాచ్‌లో సూర్య ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈసారి మాత్రం మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News