Sunday, December 22, 2024

గెలుపు లాంఛనమే!

- Advertisement -
- Advertisement -

రెండో ఇన్నింగ్స్‌లో145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
 భారత్ లక్షం 192 పరుగులు..,  ప్రస్తుతం 40/0

రాంచీ : నాలుగో టెస్టులో భారత్ గెలుపు ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరగులతో వెనుకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు అశ్వి న్, కుల్‌దీప్ చెలరేగడంతో 145 పరుగులకే ఇం గ్లండ్‌ను కట్టడి చేశారు. ఇక 192 పరుగల లక్షంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 53.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.

రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్ యాదవ్ (4/22) స్పిన్ ధాటికికి ఇంగ్లిష్ జట్టు విలవిలలాడింది. జాక్ క్రాలే (60) టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను అశ్విన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో వరుస బం తుల్లో బెన్ డకెట్ (15), ఒలీ పోప్ (0)ను ఔట్ చేశాడు. కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ జో రూ ట్ (11)ను సయితం అశ్విన్ వికెట్ల ముందు దొరకబట్టాడు. కుల్‌దీప్ యాదవ్ కూడా చెలరేగడంతో టీ విరామానికి ఇంగ్లండ్ 120/5తో నిలిచింది. అయితే ఆఖరి సెషన్‌ను జడేజా వికెట్‌తో ప్రారంభించాడు.

క్రీజులో పాతుకుపోతున్న జానీ బెయిర్‌స్టో(30)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో టామ్ హర్ట్‌లీ (7), రాబిన్సన్ (0) ఔట్ చేశాడు. అనంతరం ఫోక్స్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్. .అశ్విన్‌కు బంతి అందించడంతో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌటైంది. 219/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 103.2 ఓవర్లకు 307 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కంటే 46 పరుగుల వెనుకంజతో తొలి ఇన్నింగ్స్ ము గించింది. అయితే వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(90) అద్భుత ఆటతీరుతో భారత్‌ను గట్టెక్కించాడు. కుల్‌దీప్ యాదవ్ (28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగులు జోడించి భారత్‌ను ఆదుకున్నాడు జురెల్.

అశ్విన్ నయా చరిత్ర..
నాలుగో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. 352 వికెట్లు పడగొట్టి ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఇండియాలో కుంబ్లే 350 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (219), రవీంద్ర జడేజా (206) ఉ న్నారు. అయితే అశ్విన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ప్రత్యర్థి జట్టుపై 100 వికెట్లు తీయడమే కష్టమంటే.. అశ్విన్ రెండు దేశాలపై ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై 114 వికె ట్లు, ఇంగ్లండ్‌పై 102 వికెట్లు పడగొట్టాడు. టెస్టు ల్లో రెండు దేశాలపై 100కు పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News