Sunday, December 22, 2024

ఆకాశ్ దీప్ కు మూడో వికెట్… క్రాలే క్లీన్ బౌల్డ్

- Advertisement -
- Advertisement -

రాంచీ మైదానం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ వేసే బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తట్టుకోలేకపోతున్నారు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయారు. 4వ ఓవర్ లో బౌల్డయినా నోబాల్ తో తప్పించుకున్న క్రాలే(42), ఈ సారీ ఆకాశ్ ధాటికి నిలవలేదు. 11.5 వద్ద అతడు వేసిన అద్భుతమైన బంతికి మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యారు. క్రీజులోకి బెయిర్ స్టో వచ్చాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News