- Advertisement -
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య చెన్నై టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ 420 పరుగుల లక్ష్యఛేదనకు పోరాడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (39) పరుగులకే వికెట్ కోల్పోయాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్(15), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా గెలవాలంటే 381 పరుగులు చేయాల్సిఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 178 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 పరుగులు చేసింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 337పరుగులే రాబట్టింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 241 పరుగుల ఆధిక్యం సాధిందచింది. స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ను అశ్విన్ హడలెత్తించాడు. అశ్విన్ 6 వికెట్లు తీయడంతో 178కే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది.
- Advertisement -