Sunday, December 22, 2024

కష్టాల్లో ఇంగ్లండ్.. అశ్విన్ కు 4 వికెట్లు!

- Advertisement -
- Advertisement -

మొదటి ఇన్నింగ్స్ లో తడబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తీరు కనబరుస్తోంది. ధర్మశాలలో టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో లంచ్ సమయానికి ఆ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో కులదీప్ యాదవ్ ఇంగ్లండ్ వెన్ను విరవగా, రెండో ఇన్నింగ్స్ లో ఆ బాధ్యతను అశ్విన్ చేపట్టాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ డకెట్ రెండే రెండు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్ లో వచ్చిన ఓలీ పోప్ 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మూడు వికెట్లూ అశ్విన్ కే దక్కడం విశేషం. ఇక కులదీప్ యాదవ్ బౌలింగ్ లో బెయిర్ స్టో ఎల్ బి డబ్ల్యుగా వెనుదిరిగాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో టెస్టులో ఫామ్ లోకొచ్చిన జో రూట్ ఒక్కడే కాస్త నిలకడగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News