Monday, December 23, 2024

సాధనే.. సాధన

- Advertisement -
- Advertisement -

చెమటోడ్చిన క్రికెటర్లు

మన తెలంగాణ/ హైదరాబాద్: భారత్‌- ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్ల క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ఉదయం ఇంగ్లండ్ టీమ్ ప్రాక్టీస్ చేయగా, మధ్యాహ్నం భారత ఆటగాళ్లు సాధన చేశారు. సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఆరంభ మ్యాచ్‌కు ఉప్పల్ వేదికగా నిలిచింది. రెండో టెస్టు విశాఖపట్నంలో జరుగనుంది. కాగా, టెస్టు మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా, ఈ మ్యాచ్‌ను ఇటు ఇంగ్లండ్ అటు భారత్ సవాల్‌గా తీసుకున్నాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధనలో నిమగ్నమయ్యారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హైదరాబాదీ స్టయిలీష్ బౌలర్ సిరాజ్, జడేజా, అశ్విన్, యశస్వి జైస్వాల్, గిల్ తదితరులు సాధనలో పాల్గొన్నారు. ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, రూట్, క్రాలీ, బెయిర్‌స్టో, అండర్సన్ తదితరులు ప్రాక్టీస్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News