Friday, December 20, 2024

భారత్‌,ఇంగ్లండ్ పోరు వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

గౌహతి: ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నం గౌహతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పిచ్ మొత్తం చిత్తడిగా మారింది. పలుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ ఐదు నుంచి వరల్డ్‌కప్‌కు తెరలేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బరిలో ఉన్న అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. కాగా, తొలి ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News