Wednesday, January 22, 2025

ఇంగ్లండ్ మహిళలకు సిరీస్..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్‌తో శనివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ మహిళల టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత్ 16.2 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (30), స్మృతి మంధాన (10) ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా వారు విఫలం కావడంతో జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలింది.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో డీన్, లౌరెన్ బెల్, ఎక్లెస్టోన్, సారా గ్లెన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లు అద్భుత పోరాట పటిమను కనబరచడంతో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాప్సె (25), సివర్ (16) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News