Monday, December 23, 2024

ఫుల్ జోష్‌లో కుర్రాళ్లు..

- Advertisement -
- Advertisement -

India vs Ireland 1st T20I Match on Sunday

డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. రెండు జట్ల మధ్య తొలి టి20 ఆదివారం జరుగనుంది. మరోవైపు ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు. రానున్న టి20 ప్రపంచ కప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం కల్పించారు. వారు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యువ భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని మరో జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐర్లాండ్ సిరీస్ కోసం కుర్రాళ్లతో కూడిన జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది.

India vs Ireland 1st T20I Match on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News