సమరోత్సాహంతో భారత్
ఐర్లాండ్‌కు పరీక్ష, నేడు చివరి టి20
డబ్లిన్: ఐర్లాండ్‌తో మంగళవారం జరిగే రెండో, చివరి టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఓడిన ఆతిథ్య ఐర్లాండ్‌కు ఈ పోరు చావో రేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కిందటి మ్యాచ్‌లో మెరుగైన స్కోరును సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్ల వైఫల్యంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను డ్రా చేయాలనే పట్టుదలతో ఐర్లాండ్ కనిపిస్తోమ్లి మ్యాచ్‌లో రాణించిన హారి టెక్టర్‌పై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. తొలి టి20లో టెక్టర్ 33 బంతుల్లోనే 64 పరుగులు చేసి భారత బౌలర్లను హడలెత్తించాడు.
మరోవైపు తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా కనిపిస్తోంది. తొలి టి20లో సమష్టిగా రాణించిన టీమిండియా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. భువనేశ్వర్, ఉమ్రాన్, అవేశ్, చాహల్, హార్దిక్, అక్షర్‌లతో బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక దీపక్ హుడా, హార్దిక్, సూర్యకుమార్, ఇషాన్, దినేశ్, రుతురాజ్ తదితరులతో బ్యాటింగ్ కూడా బలోపేతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
India vs Ireland 2nd T20 Match Today