ముంబై : వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ముగించిన టీమిండియా మరో సిరీస్‌కు సన్నద్ధమైంది. ఐర్లాండ్‌తో గురువారం నుంచి ప్రారం భం కానున్న మూడు టి20ల సిరీస్‌లో టీమిండియా మూడో జట్టు గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ 2023 నేపథ్యంలో ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు విశ్రాంతి కల్పించారు. దీంతో వెన్ను గాయంతో గతేడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో జట్టులో చేరనున్నాడు. అంతేకాదు సిరీస్‌కు అతనే సారధి.
బుమ్రాతో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బుమ్రాకు ఈ సిరీస్ ఉపకరిస్తుందనే చెప్పొచ్చు. ఇక వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లు ఈ సిరీస్‌కు ఆడనున్నారు. ఈ ఇద్దరితో పాటు సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్‌లకూ జట్టులో చోటు కల్పించారు. ఇటీవలె ఐసిఎల్‌లో సత్తా చాటిన రింకూ సింగ్ తొలిసారి టీమిండియాకు ఆడనున్నాడు.
యువ బ్యాటర్ శివమ్ దూబే భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కుర్రాళ్లతో కూడిన ఈ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఎక్కడా చూసి చర్చనీయాంశమై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పర్యటన నుంచి రాహుల్ ద్రవిడ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు విశ్రాంతి కల్పించడంతో సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా భారత జట్టు శక్రవారం తొలి టి20 మ్యాచ్‌తో ఈ సిరీస్‌లోకి ఎంట్రి ఇవ్వనుంది.
తొలి టి20 భారత జట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్‌దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్/ ప్రసిధ్ కృష్ణ