Monday, January 20, 2025

జపాన్‌తో భారత్ ఢీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో జపాన్ టీమ్‌తో ఆతిథ్య భారత జట్టు తలపడనుంది. మరో సెమీస్‌లో మలేసియాతో కొరియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఐదో స్థానం కోసం జరిగే పోరులో పాకిస్థాన్‌చైనా జట్లు పోటీ పడుతాయి. కాగా, లీగ్ దశలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో విజయం సాధించింది. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఈసారి మాత్రం జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. చివరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే జోరును జపాన్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, మణ్‌దీప్ సింగ్, నీలకంఠ, వరుణ్‌కుమార్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. అయితే లీగ్ దశలో భారత్‌ను నిలువరించిన జపాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News