Sunday, January 19, 2025

హాకీలో భారత్‌కు హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 42 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఆట 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్ మొదటి గోల్‌ను నమోదు చేసింది. అభిషేక్ ఈ గోల్ సాధించాడు. 24వ నిమిషంలో మణ్‌దీప్ సింగ్ భారత్‌కు రెండో గోల్ అందించాడు. 34వ నిమిషంలో రోహిదాస్ భారత్ తరఫున మూడో గోల్ నమోదు చేశాడు. ఇక 48వ నిమిషంలో బారత్ నాలుగో గోల్ సాధించింది. ఆ తర్వాత జపాన్ రెండు గోల్స్ సాధించినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News