- Advertisement -
హైదరాబాద్: విపక్ష కూటమికి ఐఎన్‌డిఐఎ పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఐఎన్‌డిఐఎ పేరుపై విపక్ష నేతల ఏకాభిప్రాయం చేసుకోనున్నారు. మరికాసేపట్లో పేరును విపక్ష నేతలు ప్రకటించనున్నారు. విపక్షాల కూటమికి ఇండియా పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. ఎన్‌డిఎ వర్సెస్ ఐఎన్‌డిఐఎ నినాదంతో పార్లమెంటు ఎన్నికలకు ప్రతిపక్షాలు ప్రచారం ఆస్త్రంగా వినియోగించుకోనున్నాయి. ఇంకా బెంగళూరులో విపక్షాల సమావేశం కొనసాగుతోంది. ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్ క్లూజివ్ అలయన్స అంటూ రాహుల్ గాంధీ ఆ పేరు ప్రతిపాదించారు. ఇటి, ఐడి, సిబిఐని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని విపక్షాలు మండిపడ్డాయి.
- Advertisement -