Monday, January 20, 2025

మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సెంచరీకి చేరువలో గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శుబ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ మంచి షాట్లతో అలరించాడు. టిక్కర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ మిడాన్లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చాడు. అటు విరాట్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. భారత్ 27 ఓవర్లలో 168/3 స్కోరుతో నిలిచింది. శుబ్ మన్ గిల్ సెంచరీకి చేరువులో ఉన్నాడు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ 83 బంతుల్లో 92 పరుగులు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News