Thursday, January 23, 2025

బౌలర్ల విజృంభణ.. 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్ వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. న్యూజిలాండ్ తో రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్ ను భయపెడుతున్నారు. రాయ్ పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ముచ్చట తెలిసిందే. న్యూజిలాండ్ 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. సీనియర్ పేసర్‌‌ మహ్మద్ షమీకి 3 వికెట్లు, సిరాజ్, పాండ్యా, శార్ధూల్ తలో వికెట్ పడగొట్టారు. తొలి వన్డేలో వీరవిహారం చేసిన బ్రాస్ వేల్ వికెట్ ను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ 21.1 ఓవర్లలో 65/6 స్కోరుతో నిలిచింది. తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News