Friday, December 20, 2024

జోరుమీదున్న రోహిత్, గిల్..

- Advertisement -
- Advertisement -

సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఈసారి కూడా వీరిద్దరూ జట్టుకు మెరుగైన ఆరంభం అందించాలని భావిస్తున్నారు. ఇద్దరు పామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిచ్చే అంశంగా చెప్పాలి.

అంతేగాక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే 594 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి జట్టుకు చాలా కీలకంగా మారాడు. కోహ్లి విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నెదర్లాండ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో శ్రేయస్, రాహుల్‌లు సెంచరీలతో చెలరేగిపోయారు.

ఈసారి కూడా విజృంభించాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా భారత్ సమతూకంగా ఉంది. షమి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలతో కూడిన బౌలింగ్ లైనప్ ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను హడలెత్తిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News