- Advertisement -
విశాఖపట్నం: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు సెమీ ఫైనల్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ జరగనుంది. దీంతో మూడు భారీ స్క్రీన్లను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. విజయవాడ, కడప, విశాఖపట్నంలో భారీ స్కీన్లను ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్‌లోని కాళీమాత గుడి ముందు, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీలో మైదానంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని ఎసిఎ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒక్కో చోట సుమారు పది వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. క్రికెట్ అభిమానులు ఉచితంగా వీక్షించొచ్చని పేర్కొన్నారు.
- Advertisement -