Sunday, December 22, 2024

నేడు తొలి వన్డే..

- Advertisement -
- Advertisement -

జోహెన్నస్‌బర్గ్: భారత్‌ -సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. జోహెన్నస్‌బర్గ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఇటీవల ముగిసిన టి20 సిరీస్ 11తో సమంగా ముగిసింది. కాగా, వన్డే సిరీస్‌లో టీమిండియాకు కెఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. టి20లలో ఆడిన యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సిరాజ్, జడేజా తదితరులు ఈసారి జట్టుకు దూరంగా ఉన్నారు. కెఎల్ రాహుల్, రజత్ పటిదార్, సాయి సుదర్షన్, సంజు శాంసన్, అవేశ్ ఖాన్, చాహల్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ నటేల్ తదితరులు జట్టులోకి వచ్చారు. టి20లలో మెరుపులు మెరిపించిన యువ సంచలనం రింకు సింగ్ వన్డేల్లో కూడా బరిలోకి దిగనున్నాడు. అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కొత్త ఆటగాళ్లు పటిదార్, సాయి సుదర్షన్‌లకు కూడా సిరీస్ కీలకంగా మారింది. సంజు శాంసన్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇతర ఆటగాళ్లతో పోల్చితే సంజుకు టీమిండియాలో చాలా తక్కువ అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి. ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైతే అతన్ని జట్టు నుంచి తొలగిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో సంజు ఉన్నాడు. ఇందులో ఎంతవరకు సఫలమవుతాడో చూడాల్సిందే.

రాహుల్‌కు కీలకం..
ఇక జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తున్న రాహుల్‌కు సిరీస్ కీలకంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఒంటిచ్తే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా అతనికి ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక అనుభవజ్ఞుడు రాహుల్ మాత్రమే. దీంతో అతనిపై జట్టు ఆశలు నిలిచాయి. శ్రేయస్ అయ్యర్ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుతేజం తిలక్‌వర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. కుల్దీప్, చాహల్, అక్షర్, సుందర్‌లతో స్పిన్ విభాగం బలంగా కనిపిస్తోంది. అంతేగాక ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ తదితరులతో ఫాస్ట్ బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. రెండు విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న టీమిండియా వన్డే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

ఫేవరెట్‌గా..
మరోవైపు ఆతిథ్య సౌతాఫ్రికా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. రీజా హెండ్రిక్స్, వండర్ డుస్సెన్, కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక తబ్రేస్ షంసి, కేశవ్ మహారాజ్, వెర్రిన్నె, ముల్డర్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో పాటు సొంత గడ్డపై ఆడుతుండడం సౌతాఫ్రికా సానుకూల అంశంగా చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News