Sunday, December 22, 2024

రెండో టి20లో దక్షిణాఫ్రికా గెలుపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియాతో దక్షిణాఫ్రికా మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టి20లో డక్ వర్త్ లూయిస్ ప్రద్దతి ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుభ్‌మన్ గిల్ (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యా దవ్, తిలక్‌వర్మలు ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.

తిలక్‌వర్మ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టె న్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఐదు ఫోర్లు, 3 సిక్సర్లతో 36 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఇక రింకు సింగ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెలరేగి ఆడిన రింకు 39 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం వర్షం ఆగిపోవడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152 గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్నిదక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్సోయి 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. రిజా హెండ్రిక్స్ 49, ఐడెన్ మార్ క్రమ్ 30 మెరుపులు మెరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News